చిత్రసీమలో హీరోయిన్లు గా ఛాన్సులు రావాలంటే అంత ఈజీ కాదు..అందం , అభినయం , నటన ఒక్కటే కాదు..మరికొన్ని వాటికీ కూడా అడ్డు చెప్పకూడదు..దర్శక , నిర్మాతలు ఏమి అడిగిన కాదనకుండా ఉన్నప్పుడే ఛాన్సులు వస్తాయి. ఇది మీము చెప్పే మాట కాదు సాక్ష్యాత్తు ఇలాంటి సంఘటనలు ఎదురుకున్న హీరోయిన్లు చెప్పే మాట. ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంటుందని అగ్ర హీరోయిన్ల నుండి చిన్న చితక హీరోయిన్ల వరకు అంత చెపుతూ వస్తున్నారు.
తాజాగా హిందీ బుల్లితెరపై సూపర్ ఇమేజ్ సంపాదించుకున్న డోనాల్ తనకు కెరియర్ మొదట్లో ఎదురైనా ఓ విషయాన్నీ తెలిపి షాక్ ఇచ్చింది. కెరీర్ ఆరంభంలో నేను ఓ హిందీ షోకు సెలెక్ట్ అయ్యాను. డేట్స్ ఇచ్చేశాను. రెమ్యూనరేషన్ కూడా ఫైనల్ అయ్యింది. అయితే ఆకస్మాత్తుగా ఆ ప్రాజెక్ట్ నుంచి నన్ను తొలగించారు. వేరే నటిని తీసుకున్నారు. ఈ సంఘటనతో షాక్ అయ్యా. బాలీవుడ్ వాళ్లు అంటేనే అబద్ధమనే అభిప్రాయం ఏర్పడిపోయింది. అయితే నటన మీద నాకున్న పిచ్చి కారణంగా ఆడిషన్లకు వెళ్లడం మానలేదు. అలాంటి సమయంలో సౌత్‌లో ఇంతకన్నా భయంకరమైన అనుభవం ఒకటి ఎదురైంది. తనతో ఓ రాత్రి గడిపితే అవకాశం ఇస్తానని ఓ దర్శకుడు అడిగాడు. నేను అతడి మీద పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా కష్టాన్నే నమ్ముకున్నాన`ని డోనాల్ తెలిపింది.