దాదాపు ఎనిమిది నెలల తర్వాత థియేటర్స్ లలో సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రిలీజ్ కాబోతుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కరోనా కల్లోలం అనంతరం విడుదలవుతున్న తొలి సినిమా కావడం తో దీని మీదే టాలీవుడ్ ఆశలు పెట్టుకుంది.
థియేటర్లకు జనాలను ధైర్యంగా రప్పించగలిగితే తరువాత సినిమాల విడుదల సుగమం అవుతుంది. జనాలు రాకపోతే టాలీవుడ్ దిగాలు పడిపోతుంది. అందుకే సోలో బతుకు సినిమాకు అండగా నిలవాలని చిత్రసీమ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి దగ్గరి నుండి చాలామంది ఈ సినిమా ను థియేటర్స్ లలో చూడాలని , ఫేస్ కు మాస్క్ ధరించాలని చెపుతున్నారు. అలాగే పలువురు నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూడా తొలిరోజు, తొలి ఆటకు థియేటర్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందరూ ఒకే థియేటర్ కు కాకుండా వివిధ థియేటర్లకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మీద సోలో సినిమా ఫై అంత ఆశలు పెట్టుకున్నారు. మరి సోలో ను ఎంతమంది చూస్తారో చూడాలి.