ప్రీ వెడ్డింగ్ పార్టీ అనగానే రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించా అని ఖంగారు పడకండి. మిము చెప్పేది సింగర్ సునీత రెండో ప్రీ వెడ్డింగ్ పార్టీ గురించి. ఎన్నో వందల పాటలతో ప్రేక్షకులను అలరించిన సింగర్ సునీత..త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేని తో ఏడడుగులు వేయబోతుంది. రీసెంట్ గా వీరి నిశ్చితార్థం జరిగింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సునీత తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పుకొచ్చింది. కొద్ది మంది సమక్షంలోనే వీరి నిశ్చితార్ద వేడుక జరిగింది. వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్న నేపథ్యంలో వీరి ప్రీ వెడ్డింగ్ పార్టీ ని హీరో నితిన్ ఇచ్చారు.
హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో ఈ ప్రీ వెడ్డింగ్ పార్టీ ని ఏర్పాటు చేశాడు. నితిన్ కుటుంబంకు రామ్ సన్నిహితుడు. నితిన్ తో రామ్ కు చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. ఆ కారణంగానే నితిన్ వీరిద్దరికి ఫ్రీ వెడ్డింగ్ పార్టీని ఇచ్చాడు. ఈ వేడుక కు కొంతమంది సినీ ప్రముఖులు హాజరు కాగా వారిలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం హాజరైంది. సునీతతో రేణు కు మంచి స్నేహం ఉంది. ఇద్దరి మద్య కొన్ని కామన్ పాయింట్స్ ఉండటం వల్ల కనెక్ట్ అయ్యాం అంటూ గతంలో వారు చెప్పుకొచ్చారు. ఇద్దరి మద్య ఉన్న స్నేహం కారణంగా రేణు ఈ ఫ్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొనడం జరిగిందంటున్నారు. ఈ పార్టీ లో రేణు ఫుల్ గా ఎంజాయ్ చేసిందని తెలుస్తుంది.