స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వచ్చిన చిత్రం అల వైకుంఠపురం లో. పూజా హగ్దే హీరోయిన్ గా నివేత హితురాజ్ , సుశాంత్ , టబు , జయరాం , సునీల్ మొదలగు వారు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు. బాక్స్ ఆఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసి భారీ హిట్ కొట్టింది. ఇక ఈ చిత్రంలోని పాటల గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. అంతలా ఈ చిత్ర పాటలు దుమ్ములేపాడమే కాదు ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేశాయో..చేస్తున్నాయో కూడా చెప్పడం కష్టం.
ఇప్పటికే వన్ బిలియన్ వ్యూస్ దక్కించుకున్న ఈ పాటలు ..అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ లో ఎక్కువ స్ట్రీమింగ్ వ్యూస్ తెచ్చుకున్న ఆల్బమ్ గా రికార్డుకెక్కాయి. తాజాగా 2020లో అత్యధికంగా స్ట్రీమ్ చేయబడ్డ పాటలుగా అల వైకుంఠపురములో పాటలు రికార్డుని సెట్ చేసాయి. ఈ మేరకు సంగీత దర్శకుడు థమన్ ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నాడు. అంతే కాదు ఆదిత్య మ్యూజిక్.. 2020లో అత్యధిక ప్రజాదరణ పొందిన పాటల రైట్స్ దక్కించుకున్న మ్యూజిక్ కంపెనీగా రికార్డులో కెక్కింది.
భీష్మ , ఉప్పెన , పలాస , రంగ్ దే, వకీల్ సాబ్ తదితర సినిమాల ఆడియోలు విడుదల చేసిన ఆదిత్య మ్యూజిక్.. కేవలం ‘అల వైకుంఠపురంలో’ ఆల్బమ్ తోనే దాదాపు 12కోట్ల వరకు లాభాలు సంపాదించుకుందట. మొత్తం మీద అల వల్ల అందరి పంటపడింది.