బిగ్ బాస్ 4 సీజన్ అనుకున్నట్లే ఎంతో సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా ఫైనల్ ఎపిసోడ్ కన్నుల పండగ గా జరిగింది. డాన్సులు , కామెడీ , సాంగ్స్ ఇలా అన్ని సమపాలనలో జరిగాయి. ఐదు గంటలపాటు పూర్తి ఎంటైర్ టైన్మెంట్ తో సాగిన ఈ షో కు ముఖ్యఅతిధిగా చిరంజీవి హాజరై షో కు మరింత ఆకర్షణ తెచ్చారు. గ్రాండ్ ఫినాలేలో అభిజిత్ టైటిల్ విన్నర్ గా నిలవగా.. అఖిల్ రన్నరప్ గా నిలిచాడు. అంతే కాదు టాప్ 3 సభ్యులు గట్టిగానే డబ్బులు తీసుకెళ్లారని అంటున్నారు. ఇదిలా ఉంటె ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడనేది చర్చ గా మారింది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు సీజన్ 4 కు గాను నాగ్ రూ. 7 కోట్లు అని తెలుస్తోంది. వాస్తవానికి బిగ్ బాస్ షో నిర్వాహకులు నాగార్జునతో 30 ఎపిసోడ్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే వైల్డ్ డాగ్ షూటింగ్ కారణంగా ఆయన రెండు ఎపిసోడ్లు చేయలేదు. అయితే దానికి సంబంధం లేకుండా షో నిర్వాహకులు రూ. 7 కోట్లు ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.