వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయినా రామ్ గోపాల్ వర్మ కు మిర్యాలగూడ పోలీసులు షాక్ ఇచ్చారు. సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృతల ప్రేమకథ ఆధారంగా వర్మ మర్డర్ అనే సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో విడుదల కాకుండా చూడాలని అమృత తండ్రి మారుతీ రావు కోర్ట్ లో పిర్యాదు చేసారు. అయినప్పటికీ కోర్ట్ కొన్ని షరతులతో విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో డిసెంబరు 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. ఐతే ప్రమోషన్లలో భాగంగా వర్మ మిర్యాల గూడ నటరాజ్ థియేటర్లో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడానికి సంకల్పించాడు. ఐతే సడెన్ గా పోలీసులు వర్మకి షాకిచ్చారు.
నటరాజ్ థియేటర్లో ప్రెస్ మీట్ నిర్వహించడానికి అనుమతి లేనందున అడ్డుకున్నారు. దాంతో ప్రెస్ మీట్ జరగలేదు. ఈ ప్రెస్ మీట్ కారణంగా అనుచిత కార్యక్రమాలేమైనా రూపుదిద్దుకుంటాయన్న ఉద్దేశ్యంతో పోలీసులు అడ్డుకున్నారట. ఈ నేపథ్యంలో వర్మ ట్వీట్ చేస్తూ ప్రెస్ మీట్ మరికొద్ది రోజుల్లో ఉంటుందని, మిర్యాల గూడ ఎస్పీ గారికి థ్యాంక్స్ తెలిపాడు.