లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడడం తో ఎన్నో చిత్రాలు విడుదలకు నోచుకోకుండా ల్యాబ్ కే అంకితమయ్యాయి. ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ కావడం తో సినిమాల సందడి మొదలుకాబోతుంది. అసలైన సినీ సందడి అంటే సంక్రాంతినే. సంక్రాంతి వస్తుందంటే పెద్ద చిత్రాలన్ని రిలీజ్ కు క్యూ కడుతుంటాయి. ఈసారి కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు పెద్ద చిత్రాలు బరిలోకి దిగబోతున్నాయి. ఆ ఆరు తో నేనుకూడా అంటున్నాడు అల్లరోడు.
అల్లరి నరేష్ నటించిన బంగారు బుల్లోడు చిత్రాన్ని జనవరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ‘నందిని నర్సింగ్ హోమ్’ లాంటి కామెడీ డ్రామాకు దర్శకత్వం వహించిన పీవీ గిరి ఈ సినిమాకు దర్శకత్వం వస్తున్నాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ కు జోడీగా పూజా ఝవేరి నటిస్తోంది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా.. ఎకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడడం తో ఈ చిత్ర రిలీజ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ కావడం తో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. జనవరి లో ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారట. దీనికి సంబందించిన ప్రకటన అతి త్వరలోనే తెలియపరుస్తారట. మరి ఇప్పటికే జనవరిలో ఆరు పెద్ద చిత్రాలు బరిలో ఉండగా..వాటితో అల్లరోడు తట్టుకొని నిలబగలడా అనేది సందేహం గా మారింది. మరి జనవరిలోనే రిలీజ్ చేస్తారా లేక మరో నెల చూస్తారా నేది చూడాలి.