బిగ్ బాస్ 4 ఫైనల్ ఎపిసోడ్ కన్నుల పండగ గా జరిగింది. డాన్సులు , కామెడీ , సాంగ్స్ ఇలా అన్ని సమపాలనలో జరిగాయి. నాల్గు గంటలపాటు పూర్తి ఎంటైర్ టైన్మెంట్ తో సాగిన ఈ షో కు ముఖ్యఅతిధిగా చిరంజీవి హాజరై షో కు మరింత ఆకర్షణ తెచ్చారు. ఎయితే ఈ షో కు బిగ్ బాస్ యాజమాన్యం భారీ ఖర్చే చేసినట్లు వార్తలు విన్పిస్తున్నాయి.
లక్ష్మీ రాయ్, అనిల్ రావిపూడి, మెహ్రీన్, ప్రణీత సహా మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చాడు. అందరికీ ఎంతోకొంత అయితే కచ్చితంగా ఇవ్వాల్సిందే. వాళ్లతో పాటు పాత కంటెస్టెంట్స్ కూడా వచ్చారు. డాన్సులు కూడా చేసారు. వాళ్లు కూడా ఎంతో కొంత పుచ్చుకునే ఉంటారు. ఈ మొత్తం ఎంత లెక్క అయ్యుంటుందనేది అందరిలో మేలుగుతోంది. దీనికి సమాధానం 2.5 కోట్లు అనే తెలుస్తుంది. కేవలం ఫినాలే ఎపిసోడ్ కోసమే అంత ఖర్చు చేసారని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ప్రైజ్ మనీ 50 లక్షలు కాకుండా అక్కడ సెట్‌కు.. జరిగిన ఈవెంట్‌కు.. చేసిన డాన్సులకు అన్నీ కలిపి రెండున్నర కోట్లకు పైగానే అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 4 లాంఛింగ్ ఎపిసోడ్ కోసం కోటిన్నర వరకు ఖర్చు చేసారు. మళ్లీ ఇప్పుడు అంత భారీగా ఫినాలే కోసం ఖర్చు చేసారని తెలుస్తుంది.