అల్లు అర్జున్ అంటే తెలియనివారుండరు. తెలుగు , తమిళ్ , మలయాళం ఇలా అన్ని చోట్ల బన్నీ కి వీరాభిమానులు ఉన్నారు. ఆయనతో ఓ సెల్ఫీ గిగాలని , ఓ ఆటోగ్రాఫ్ తీసుకోవాలని కలలు కంటుంటారు. తాజాగా ఓ అనాధ సైతం తన మనసులోని కోరికని బయటపెట్టాడు. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో అనాథలుగా ఉన్నవారిని సంతోష పెట్టేందుకు వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు ఒక అనాథాశ్రమానికి వెళ్లారు. అక్కడ పిల్లలకు ఎలాంటి బహుమతులు కావాలంటూ ఒక వీడియో షూట్ చేశారు. అయితే.. అక్కడ ఓ బాలుడు ఆమెను ఆశ్చర్యపరిచే బహుతి అడిగాడు.
ఈ క్రిస్మస్ కు గిఫ్ట్ గా తనకు అల్లు అర్జున్ ఆటో గ్రాఫ్ కావాలని అడిగాడు. ‘సరే.. ప్రయత్నిస్తాను. నీకు ఇంకే గిఫ్టు కావాలి?’ అని అడగ్గా.. ‘అల్లు అర్జున్ ఆటోగ్రాఫే తనకు అసలైన బహుమతి’ అని ఆ బాలుడు చెప్పడం తో వితిక షాక్ కు గురైంది.
దీంతో.. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. వితికా షేరు ట్విట్టర్ లో ఆ వీడియో పోస్ట్ చేసింది. దీనికి అల్లు అర్జున్ ను ట్యాగ్ చేసింది. ‘అల్లు అర్జున్ గారు.. ఈ బాలుడు మీకు పెద్ద ఫ్యాన్. ఇతను మీ ఆటో గ్రాఫ్ ను బహుమతి కోరుతున్నాడు. ఈ క్రిస్మస్ కు మీరు ఈ బాలుడి శాంతా క్లాజ్ అవుతారా?’ అంటూ ట్వీట్ చేసింది. మరి ఈ ట్వీట్ కు అల్లు అర్జున్ స్పందిస్తాడా..ఆ బాలుడి కోరిక తీరుస్తాడా అనేది చూడాలి.