టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 50 వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్బంగా ఆయనకు చిత్ర సీమా ప్రముఖులు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గత రాత్రి గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, యష్, ప్రశాంత్ నీల్, విజయ్ దేవరకొండ, రామ్, సమంత, నాగ చైతన్య, అనుపమ పరమేశ్వరన్, నితిన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరంతా దిల్ రాజుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం వీటి తాలూకా పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అయితే ఈ పిక్స్ చూసిన చాలామంది నందమూరి అభిమానులు ఎక్కడ కనిపించకపోయేసరికి అనేక రకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
దిల్ రాజు ఈ పార్టీకి బాలయ్య ను ఆహ్వానించలేదని.. అందుకే తారక్ – కళ్యాణ్ రామ్ కూడా ఈ వేడుకకు దూరంగా ఉన్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి దిల్ రాజు నందమూరి హీరోలతో చాలా క్లోజ్ గా ఉంటూ ఉంటాడు. ఎన్టీఆర్ తో పలు సినిమాలు ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు.. బాలకృష్ణ – కళ్యాణ్ రామ్ నటించిన పలు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాడు. అయినప్పటికీ వాళ్ళెవరూ ఈ పార్టీలో లేకపోవడం చర్చగా మారింది. మరి ఈ పార్టీ కి వారు రాకపోవడానికి అసలు కారణం ఏంటో..