జబర్దస్త్ షో తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈమె..ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయన చిత్రం తో వెండితెర ఫై పరిచమైంది. ఆ తర్వాత సుకుమార్ – రామ్ చరణ్ కలయికలో వచ్చిన రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త గా నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ పాత్రలో అనసూయ ను చూసి చాలామంది షాక్ అవ్వడమే కాదు..ఆ తర్వాత వరుసపెట్టి దర్శక నిర్మాతలు ఆమెకు ఆఫర్లు ఇచ్చేందుకు పోటీ పడ్డారు. కానీ ఆమె మాత్రం ఆచితూచి ఓకే చెపుతూ వస్తుంది. ప్రస్తుతం వెండితెర , బుల్లితెర ఫై రాణిస్తున్న ఈ భామ..సోషల్ మీడియా లోను అంతే యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను , నెటిజన్ల ను ఆకట్టుకుంటుంది. అయితే ఒక్కోసారి ఈమె పెట్టె పిక్స్ పలు వివాదాలకు దారితీస్తున్నాయి. ముఖ్యముగా ఆమె డ్రెస్ ఫై ఇప్పటికే అనేక సార్లు వివాదాల్లో ఈమెను హైలైట్ చేయగా..తాజాగా మరోసారి అదే జరిగింది.
గురువారం ‘జబర్దస్త్’ ఎపిసోడ్ ప్రసారం కావడానికి కొన్ని గంటల ముందు ఆరోజు షోలో పాల్గొనే లుక్‌లో ఫొటోషూట్ చేసి అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈరోజు ‘జబర్దస్త్’ లుక్‌తో ఒక ఫొటోషూట్, కొన్ని వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ లుక్‌లో అనసూయ చాలా హాట్‌గా ఉంది. ఆమె డ్రెస్ చాలా పొట్టిగా ఉంది. ఈ గ్రీన్ డ్రెస్‌లో టాప్ మాత్రమే ఉంది. బాటమ్ కనిపించట్లేదు.. చాలా చిన్నదిగా ఉంది. ఇదే కొంత మందికి ఆగ్రహం తెప్పిస్తోంది. ‘‘ప్యాంట్ మరిచిపోయారా?’’, ‘‘అంత యాంకరింగ్ చేస్తావ్ ఒక ప్యాంట్ కొనుక్కోవచ్చుగా’’ అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇవే కాదు ఇంతకన్నా దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు కానీ అవి మీకు మిము చెప్పడం ఇష్టం లేక చెప్పడం లేదు. మొత్తం మీద మరోసారి అను..డ్రెస్ వివాదాల్లోకి నెట్టింది.