యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ మొదటి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించి షో సక్సెస్ లో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత సీజన్ లకు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తాడని అంత అనుకున్నారు కానీ వరుస సినిమాలు ఉండడం తో ఎన్టీఆర్ మళ్లీ హోస్ట్ గా చేయలేదు. అయితే ఇప్పుడు మరోసారి ఓ షో కు హోస్ట్ గా వహరించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియా లో రెండు మూడు రోజులుగా వైరల్ అవుతూ వచ్చాయి. అయితే ఇకప్పుడు మరో వార్త బయటకు వచ్చి అందర్నీ షాక్ కు గురి చేస్తుంది.
ఈ షో కు హోస్ట్ గా చేస్తున్న ఎన్టీఆర్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించడంతో పాటు తానే నిర్మాతగా మారుతున్నాడట ఎన్టీఆర్. ఈ ప్రోగ్రామ్‌తో వచ్చే లాభమంతా తన అకౌంట్‌కే వెళ్తుంది కదా.. మళ్లీ రెమ్యునరేషన్ ఎందుకు అనుకున్నాడట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు. ఇది పూర్తికాగానే త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయనున్నాడు.