మెగా ఫ్యామిలీ లో ఇక వరుస పెట్టి పెళ్లి వేడుకలు జరుగబోతున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఓ ఇంటిది అయినా సంగతి తెలిసిందే.ఉదయ్‌పూర్ ప్యాలస్‌లో జొన్నలగడ్డ చైతన్యను నిహారిక పెళ్లి చేసుకుంది. ఈ వేడుక కు మెగా , అల్లు ఫ్యామిలీ సభ్యులంతా హాజరై సందడి చేసారు. ఇక ఇప్పుడు మరో మెగా వేడుక జరగబోతుందని అసలైన రహస్యం తెలిపాడు సాయి తేజ్.
సాయి తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న తేజ్..సినిమా విశేషాలతో పాటు మెగా పెళ్లి వేడుక కు సంబందించిన అప్డేట్ ఇచ్చాడు. మెగా కాంపౌండ్‌లో పెళ్లికాని యంగ్ హీరోలు ఇక ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కబోతున్నట్లు హింట్ ఇచ్చారు. అయితే ఈ లిస్టులో ముందు వరుసలో అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ ఉన్నట్లు ఆయన చెప్పారు. త్వరలోనే శిరీష్ పెళ్లి పీటలెక్కబోతున్నాడని అన్నారు. శిరీష్ తనకంటే పెద్దవాడని చెప్పిన సాయి ధరమ్ తేజ్.. వచ్చే ఏడాది ఆయన పెళ్లి జరగవచ్చని తెలిపారు. తన పెళ్లికి మాత్రం ఇంకా సమయం ఉందని, ప్రస్తుతం తనపై ఉన్న బాధ్యతలు తీరాక పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చాడు.