రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. లాక్ డౌన్ సమయంలో ఆయన పేద వలస కార్మికులకు చేసిన సాయం మొదలుకుని ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. ఈమద్య కాలంలో విద్యార్థులపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సాయం అందజేస్తూ వారికీ కనిపించే దేవుడు అవుతున్నాడు.
ఈ క్రమంలో జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ గ్రామానికి చెందిన దేవికారెడ్డి ఇబ్రహీంపట్నంలోని ‘గురునానక్ ఇనిస్టిట్యూషన్స్’లో ఫార్మా సెకండ్ ఇయర్ చదువుతోంది. గత సంవత్సరం కన్వీనర్ కోటాలో ఫార్మా.డి సీటు వచ్చింది. ఏడాదికి ఫీజు రూ.లక్షా 15వేలు చెల్లించాలి. గత సంవత్సరం అతి కష్టం మీద చెల్లించిన దేవికారెడ్డి.. ఈసారి తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. ఆమె తండ్రి ఫర్టిలైజర్స్ షాపులో చిరుద్యోగి, తల్లి గృహిణి. కాగా, సోనూసూద్ తన తల్లి పేరుపై ఓ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించి పేద విద్యార్థుల ఉన్నత చదువులకు స్కాలర్‌షిప్ ఇస్తామంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో దేవికారెడ్డి, ట్విటర్లో సోనూసూద్‌కు తన కష్టాన్ని విన్నవించింది. దీంతో కాలేజ్ ఫీజ్ ను చెల్లించేందుకు సోను ముందుకు వచ్చాడు. ఆయన అభిమానులను పంపించి కాలేజ్ లో ఫీజు చెల్లించాడు. 49500 చెక్కును యూనివర్శిటీ పేరుతో సోనూసూద్ పంపించాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ కావడం తో మరోసారి సోను గొప్పతనం గురించి అంత మాట్లాడుకుంటున్నారు.