తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 చివరి స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఇంటిలో ఆరుగురు సభ్యులు ఉండగా..వారిలో ఒకర్ని ఈరోజు ఇంటికి పంపించబోతున్నారు. మొదటి నుండి హౌస్ లో పవర్ ఫుల్ సభ్యులు ఇంటికి వెళ్తున్నప్పటికీ ..వెక్ కాంటెంస్ట్ గా ఉన్న మోనాల్ మాత్రం అలాగే హౌస్ లో కొనసాగుతూ వస్తుంది కానీ ఈరోజు మాత్రమే ఆమెను ఇంటికి పంపించబోతున్నట్లు గట్టిగా తెలుస్తుంది.
ఇన్నాళ్లూ గుజరాత్ భామ ఆటకు పట్టం కట్టిన ప్రేక్షకులు 14 (చివరి) వారంలో చరమగీతం పాడారు. దీంతో ఇన్నాళ్లు తన కళలతో ఆకట్టుకుంటూ ఫైనల్‌కి వెళ్లాలని కల కన్న మోనాల్ ఆశలు ఆవిరయ్యాయినట్టుగానే కనిపిస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ బజ్‌లో రాహుల్ సిప్లిగంజ్ ‘కతమ్ హోగయా’ అంటూ హింట్ ఇవ్వగా… మోనాల్ మోనాల్ అంటూ హింట్ పట్టుకుంటున్నారు ప్రేక్షకులు.
ఈవారం ఓటింగ్‌లో మోనాల్‌కి తక్కువ ఓట్లు పడ్డాయో.. లేక బిగ్ బాస్ మనసు మారిందో తెలియదు కానీ.. మోనాల్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. నిజానికి మోనాల్ హౌస్‌లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ కంటే ఎక్కువ సార్లు నామినేట్ అయ్యింది. నామినేషన్స్‌లో ఉన్న ప్రతిసారి చివరి వరకూ వెళ్లి.. చివర్లో సేవ్ అవుతూ వస్తోంది. దాదాపు ప్రతివారం ఇదే తంతు. అవినాష్, కుమార్ సాయి, దేవి, స్వాతి, దివి, లాస్య ఇలా బలమైన కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అవుతూ ఉన్నారు తప్పితే మోనాల్ మాత్రం సేవ్ అయ్యేది. దీంతో మోనాల్‌ని బిగ్ బాస్ రేటింగ్ కోసం కావాలని సేవ్ చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపించాయి. కానీ చివరికి మాత్రం బిగ్ బాస్ ఆమెను ఇంటికి పంపించబోతున్నారు.