మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తర్వాత మెగా ప్రొడ్యూసర్ గా అతి తక్కువ టైం లోనే గుర్తింపు తెచ్చుకున్న బన్నీ వాసు ఇంట్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. బన్నీ వాసు గవర సురేష్ అనారోగ్యంతో మరణించారు. సురేష్ గత కొద్దీ రోజులుగా రెండు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఆయన శుక్రవారం రాత్రి మృతి చెందారు. రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఆయన్ని కాపాడలేకపోయామని డాక్టర్లు చెప్పుకొచ్చారు. సురేష్‌కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. ఈ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు వాసు కు ఫోన్లలో ధైర్యం చెపుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా గవర సూర్యనారాయణకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు సురేష్ ఇంజినీరింగ్ చదివి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. రెండో కుమారుడు బన్నీవాసు తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మిస్తూ నిర్మాతగా రాణిస్తున్నారు.