నిన్నటి వరకు తెరవెనుక ఉంటూ ఎన్నో అద్భుత చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ..ఇప్పుడు తెరపై కనిపించడానికి సిద్దమవుతున్నాడు. రాఘవేంద్ర రావు ప్రధాన పాత్రలో ప్రముఖ నటుడు , డైరెక్టర్ తనికెళ్ళ భరణి డైరెక్షన్లో ఓ కొత్త సినిమా తెరకెక్కబోతుంది. ఈ చిత్ర ప్రకటన బయటకు వచ్చినప్పటి నుండి సినీ జనాలు , సినీ ప్రముఖులు ఈ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. కాగా ఈ సినిమాలో రాఘవేంద్రరావుకు జోడీగా ముగ్గురు హీరోయిన్ లని అనుకుంటున్నారు. రమ్యకృష్ణ,, సమంత , శ్రీయ లను ఫైనల్ చేయాలని తనికెళ్ల భరణి ప్లాన్ చేశారు. ఇప్పటికే రమ్యకృష్ణతో చర్చలు జరిపి ఓకే చేసుకున్నారు.
రీసెంట్ గా సమంత ను కలువగా..ఆమె షాక్ ఇచ్చిందట. 78 ఏళ్ల రాఘవేంద్రారవు పక్కన నటించడానికి ఆసక్తిని చూపించలేదట. తనికెళ్ల భరణి ఇచ్చిన ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తుంది. సమంత ప్లేస్ లో తమన్నాని సంప్రదిస్తున్నారట. సమంత ప్రస్తుతం ఏ సినిమాని అంగీకరించే మూడు లో లేదని.. ఆ కారణంగానే రాఘవేంద్రావు చిత్రాన్ని తిరస్కరించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.