పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన రేణు దేశాయ్..ఆ సినిమాతోనే పవన్ తో ప్రేమలో పడి, అతడిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వారికీ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పవన్ నుండి విడాకులు తీసుకొని పిల్లలు తీసుకొనే పూణే ఉంటుంది. ఈ మధ్యనే తిరిగి హైదరాబాద్ కు వచ్చింది. ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతుంది. ఇదిలా ఉంటె తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పవన్ తో విడాకుల గురించి నోరు విప్పింది.
బద్రి సినిమా షూటింగ్ లో ప్రేమలో పడిన పవన్ కళ్యాణ్..అంతకు ముందు నందిని వివాహం చేసుకొని ఆమెతో విడాకులు తీసుకున్నాడు. రేణు తో సహజీవనం మొదలుపెట్టి ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. ఆ తర్వాత రేణు ను వివాహం చేసుకున్నాడు. దాదాపు 11 ఏళ్ల పాటు వీరిద్దరూ కలిసి ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ మనస్ఫూర్తిగా విడిపోయారు. వీరిద్దరూ విడిపోయిన తర్వాత అనేక వార్తలు ప్రచారం అయ్యాయి. పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్నందుకు రేణుదేశాయ్ కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నారని అప్పట్లో బాగా ప్రచారం సాగింది.అయితే ఈ విషయాన్ని ఓ తప్పుడు ప్రచారం అంటూ రేణుదేశాయ్ ఖండించారు.ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల తాను ఎంతో బాధపడినట్లు తెలిపారు. ప్రస్తుతం తన పిల్లలతో ఎంతో హ్యాపీ గా ఉన్నానని , తనకు ఆద్య, అకీరాలే లోకం అని.. వాళ్లే తన సర్వస్వం అని చెప్పింది. తనకంటూ ప్రత్యేకమైన ప్రపంచం అంటూ ఏం లేదని.. పిల్లలే భవిష్యత్తు.. వాళ్లకు మంచి జీవితం ఇవ్వడమే తన ముందున్న ధ్యేయం అని చెప్పుకొచ్చింది. వాళ్లు ఎక్కడికైనా బయటికి వచ్చినపుడు లేదంటే, పవన్ వేడుకల్లో కనిపించినపుడు వాళ్ల పద్దతుల గురించి తనకు ఫోన్ చేసి దర్శకులు, నిర్మాతలు చెప్తుంటారని తెలిపింది. వాళ్లు చాలా పద్దతిగా ఉంటారని.. అందరితోనూ ఈజీగా కలిసిపోతారని చెప్తుంటే ఒక తల్లిగా తనకు చాలా గర్వంగా ఉంటుందని చెప్పుకొచ్చింది.