చాందినీ చౌదరి..ఈ పేరు చాలామందికి సుపరిచితమే..షార్ట్ ఫిలిమ్స్ తో నెటిజన్లను , సినీ లవర్స్ ను ఆకట్టుకున్న ఈమె..ఆ తర్వాత కేటుగాడు చిత్రంతో తెలుగు చలన చిత్ర తెరకు పరిచయం అయ్యింది. 2018లో నటించిన మను చిత్రంలో నీలా పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్ తరువాత కేటుగాడు సినిమాలో హీరోయిన్ గా నటించిన చాందిని బ్రహ్మోత్సవం, శమంతకమణి మొదలగు సినిమాలలో కూడా నటించింది. అయితే రీసెంట్ గా ఆహా ఓటిటి లో రిలీజ్ అయినా కలర్ ఫోటో చిత్రం ఈమెకు ఎంతో పేరును తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈమె ‘బొంబాట్’ చిత్రం లో నటించగా.. గురువారం ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విశేషాలతో పాటు తన సినీ కెరియర్ లో ఎదురుకున్న సమస్యల గురించి చెప్పుకొచ్చింది.
‘‘పరిశ్రమలో అడుగుపెట్టిన ఐదేళ్లల్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. నటిగా కిందపడుతూనే ‘కలర్ ఫొటో’తో లేచి నిలబడ్డా. ఇప్పుడు పడినా లేచి నిలబడగలననే నమ్మకం వచ్చింది. కెరీర్ బిగినింగ్‌లోనే సక్సెస్ వచ్చుంటే ఇంత కసిగా పని చేసేదాన్ని కాదేమో’’ అని చాందినీ చౌదరి అన్నారు. ‘మను’ సినిమా నుంచి నా ఆలోచనా స్థితి మారింది. కథల విషయంలో జాగ్రత్తగా, సెలెక్టివ్‌గా వెళ్తున్నా. ఐదేళ్ల కష్టం ఇప్పటికి ఫలించింది. ఓటీటీ వల్ల కూడా సినిమా ఎక్కువమందికి చేరువవుతుంది. థియేటర్ ఆడియన్స్‌ని మిస్ అయిన బాధ అయితే ఉంది. డిజిటల్ నుంచి సిల్వర్ స్ర్కీన్‌పై అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతున్నా. ఇప్పుడు డిజిటల్‌లో కూడా వెబ్ సిరీస్‌లు చేయడం ఆనందంగా ఉంది. అటు డిజిటల్, ఇటు సిల్వర్ స్ర్కీన్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
తనకు ఈ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్, గాడ్‌ఫాదర్ లేరని చెప్పుకొచ్చారు. ఎన్నోసార్లు తనకొచ్చిన అవకాశాలు చేజారిన సందర్భాలున్నాయన్నారు. చేతి వరకూ వచ్చినట్టే వచ్చి క్యారెక్టర్లు వెనక్కి వెళ్లిన చేదు అనుభవాలు లేకపోలేదన్నారు. మంచీచెడులను ఓర్పుగా భరించినట్టు చాందినీ చౌదరి తెలిపారు. సుధీర్‌వర్మతో ‘సూపర్ ఓవర్’, విశ్వక్‌సేన్‌తో ‘ప్రాజెక్ట్ గామి’, మరో రెండు చిత్రాలు సెట్ మీదకు వెళ్లబోతున్నాయి. 2021 క్యాలెండర్‌లో నా కాల్షీట్లు ఫుల్‌గా ఉన్నాయి అంటే దాని వెనక ఆరేళ్ల కష్టం ఉంది. తెలుగు అమ్మాయిలకు మంచి రోజులు వచ్చాయని నమ్ముతున్నా అని, ప్రస్తుతం ఏ పాత్రలు పోషించడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపింది.