రంగమ్మత్త గా దుమ్ములేపిన అనసూయ..ఇప్పుడు సిల్క్ స్మిత ను ఆదర్శంగా చేసుకొని కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అనసూయ..ఈ పేరు చెపితే చాలు యూత్ లో ఎక్కడాలేని కోర్కెలు పుట్టుకొస్తాయి. జబర్దస్త్ షో తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈమె..ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయన చిత్రం తో వెండితెర ఫై పరిచమైంది. ప్రస్తుతం ఓ పక్క బుల్లితెర ఫై రాణిస్తూనే..మరోపక్క వెండితెర అవకాశాలను రాబట్టుకుంటుంది. తాజాగా ఈమె కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి సినిమాతో ఈమె కోలీవుడ్ అదృష్టం పరీక్షించుకోబోతుంది. ఈ విషయాన్నీ స్వయంగా అనసూయనే తెలిపింది.
“మరో మంచి కథలో జీవిస్తున్నాను. కొత్త ప్రయాణం’’ అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో అనసూయ పేర్కొన్నారు. అంతేకాదు, తన లుక్‌ను కూడా పోస్ట్ చేసింది. అద్దంలో తన అందాన్ని చూసుకుంటూ అనసూయ ఈ ఫొటోలో కనిపించింది. అచ్చతెలుగు అమ్మాయిలా చీరలో అందంగా సింగారించుకుని ఉంది. ఈ లుక్కు ప్రముఖ నటి సిల్క్ స్మిత రిఫరెన్స్ అని అనసూయ చెప్పడం తో ఈ సినిమాలో అనసూయా సిల్క్ స్మితా పాత్ర చేస్తుందని, అందుకే అలా ఇండైరెక్ట్‌గా చెప్పిందని ఆమె అభిమానులు అంటున్నారు. మరి నిజంగా ఆ పాత్ర చేస్తుందా..లేదా అనేది తెలియాల్సి ఉంది.