గత కొంతకాలంగా థియేటర్స్ మూతపడడం తో సినీ ప్రేమికులంతా ఎప్పుడెప్పుడు థియేటర్స్ ఓపెన్ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్స్ ఓపెన్ కు రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం , అతి త్వరలో థియేటర్స్ ఓపెన్ కాబోతున్నాయని చిత్ర వర్గాలు చెపుతుండడం తో సినిమా లవర్స్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. అయితే సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన చిత్రాలన్నీ కూడా సంక్రాంతి బరిలో రాబోతున్నాయని మొన్నటి వరకు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో సంక్రాంతి బరి ఫుల్ జోరు గా ఉండబోతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఫిలిం సర్కిల్లో కొన్ని వార్తలు షాక్ కు గురి చేస్తున్నాయి.
రెండు సినిమాలు మినహా మిగిలిన సినిమాలు ఏవీ పండగ బరిలోకి దిగే సూచనలు కనిపించడం లేదంటున్నారు. రవితేజ-టాగోర్ మధుల క్రాక్, యువి నిర్మించిన చిన్న సినిమా ఈ రెండే సంక్రాంతి బరిలోకి వస్తున్నాయి. యాభై శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు విడుదల చేయడం కష్టమనే ఆలోచనే ఇందుకు కారణం అంటున్నారు. నాగ్ చైతన్య లవ్ స్టోరీ, అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ కాబినేషన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్,
నితిన్ తో నాగవంశీ నిర్మించిన వెంకీ అట్లూరి సినిమా రంగ్ దే ఇవన్నీ కూడా సంక్రాంతి బరి నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. కుదిరితే ఓటిటి లేదంటే ఫిబ్రవరి లో రిలీజ్ చేయాలనీ ఆయా నిర్మాతలు భావిస్తున్నారట.