మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ లో వచ్చి దశబ్దాలు గడుస్తున్నా ..సోషల్ మీడియా లోకి మాత్రం లేటుగా ఎంట్రీ ఇచ్చి..అతి తక్కువ టైం లోనే లక్షల సంఖ్య లో ఫాలోయర్స్ ను సొంతం చేసుకున్నాడు. వచ్చి రావడమే తన దూకుడు కనపరిచాడు. ప్రతి దాని పట్ల పోస్ట్ చేస్తూ ఆకట్టుకున్నాడు. ఇంట్లో వంటకాల దగ్గరి నుండి కొడుకు కు కౌంటర్ లు ఇచ్చే వరకు ఇలా ప్రతి దానిని ట్వీట్స్ చేస్తూ వచ్చాడు. అయితే ప్రస్తుతం తన దూకుడు తగ్గించడం అందర్నీ అయోమయంలో పడేస్తుంది.
దీపావళి సందర్భంగా తన గురువు కె.విశ్వనాథ్ ఇంటికెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకుని ఆశ్చర్యపరిచారు. ఈ తర్వాత సమంతకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ తర్వాత సోషల్ మీడియా కు దూరమయ్యాడు. చిన్నాపెద్దా అందరి పుట్టినరోజులకి విషెస్ చెప్పే చిరంజీవి.. ఇప్పుడు ఎవర్నీ పలకరించడంలేదు. అంతే కాదు తన సినిమా విశేషాలను సైతం చెప్పడం లేదు. రీసెంట్ గా జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఓటు వేసిన పిక్ కూడా పోస్ట్ చేయలేదు. మరి సడెన్ గా చిరు కు ఏమైందో అర్ధం కావడం లేదని మెగా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. చిరంజీవి కావాలని గ్యాప్ ఇచ్చారా లేక, ఇకపై పూర్తిగా అంటీముట్టనట్టుగానే ఉంటారా అనే విషయం తెలియాల్సి ఉంది.