దిల్’ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించడం తో మూడేళ్లు పాటు ఒంటరి గా ఉన్న రాజు..తనకు ఎప్పటికైన తోడు కావాలని హైదరాబాద్‌కు చెందిన తేజస్విని (వైఘా రెడ్డి)ని గత మార్చిలో రెండో వివాహం చేసుకున్నారు. లాక్ డౌన్ వేళ అతి కొద్దీ మంది సమక్షంలో నిజామాబాద్‌లోని వెంకటేశ్వర స్వామి గుడిలో వీరి విహహం జరిగింది.
కొంతకాలంగా లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడడం తో చాలామంది దర్శక , నిర్మాతలు ఓటిటి బాట పట్టారు. ఈ క్రమంలో దిల్ రాజు కూడా ఓటిటి బాట పట్టాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో తగిన కథల కోసం వెతుకుతుంటే, ఆయన భార్య తేజస్విని ఓ స్టోరీ చెప్పి తనలో కూడా ఓ రైటర్ ఉందని చెప్పకనే చెప్పింది. తన భార్య చెప్పిన స్టోరీ రాజు కు బాగా నచ్చిందట. ఆ కథకు మరింత మెరుగులు దిద్దేందుకు ఆమెకు సహాయంగా ఓ రచనా బృందాన్ని ఏర్పాటు చేశాడని తాజా సమాచారం. కథ ఫైనల్ అవుట్ పుట్ బాగుంటే.. ఈ కథనే ఓ వెబ్ సీరిస్‌గా తీయనున్నారని టాక్ నడుస్తోంది. మొత్తం మీద రాజు కు తేజస్విని పెద్ద సాయమే చేస్తుంది.