బాహుబలి చిత్రం తో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..ఆ తర్వాత వరుస పాన్ మూవీస్ లలో నటిస్తూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం రాధే శ్యామ్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే మరో రెండు పాన్ మూవీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అభిమానుల్లో సంబరాలు నింపాడు. ఇప్పుడు మరో భారీ ప్రకటించి మరింత సంబరాలకు గురి చేసాడు. కెజిఎఫ్ చిత్రంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడు.
దీనికి సంబందించిన అధికారిక ప్రకటనను విడుదల చేసారు. వీరిద్దరి కలయికలో తెరకెక్కబోయే చిత్రానికి ‘సలార్’ అనే టైటిల్ను ఫిక్స్ చేస్తూ చిత్ర యూనిట్ బుధవారం అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ (కేజీఎఫ్ మూవీ ప్రొడ్యూసర్) నిర్మించనున్నారు. మరి ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఎవరు నటిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక వచ్చే ఏడాది జవవరిలో సలార్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే ..కెజిఎఫ్ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారు. దీనికి సంబందించిన షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.
An Action Saga #SALAAR.
THE MOST VIOLENT MEN.. .CALLED ONE MAN… THE MOST VIOLENT!!
For the love of cinema, breaking the fence of languages, presenting to you an Indian Film.
Dearest welcome to Darling #Prabhas sir.@hombalefilms @VKiragandur pic.twitter.com/PKOfQKkSM6— Prashanth Neel (@prashanth_neel) December 2, 2020