సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాల నెలల తర్వాత ప్రజల మధ్యకు వచ్చారు. కరోనా మొదలైనప్పటికీ హైదరాబాద్ కే అంకితమైన పవన్..రీసెంట్ గా పార్టీ సమావేశాల కోసం ఏపీలో అడుగుపెట్టాడు.ఇక ఇప్పుడు తుఫాను వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు కృష్ణా జిల్లాలో అడుగుపెట్టాడు.
నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ముందుగా ఉయ్యూరులో రైతులతో కలిసి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. తుఫాన్, భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని.. జనసేనానికి పలువురు అన్నదాతలు నష్టపోయిన పంటలను చూపించారు. తమ కష్టాలను పవన్‌తో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలను చూసి పవన్ కళ్యాణ్ చలించిపోయారు. నివర్ తుఫాన్ రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని.. అందరికీ అన్నం పెట్టే రైతు కన్నీరు మంచిది కాదన్నారు. అన్నదాతలకు భరోసా ఇచ్చేందు.. వారికి ధైర్యం చెప్పేందుకు వచ్చాను అన్నారు. ఇవాళ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, 3, 4, 5తేదీల్లో చిత్తూరు,నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.