హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల పోలింగ్ మొదలైంది. మొన్నటివరకు నగరంలో ప్రచారం అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో హోరాహోరీగా జరిగిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకొని ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేశాయి. మరి ఓటర్లు తమ ఓటు ను వేసే సమయం వచ్చేసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ సాగనుంది. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
అయితే ఈ ఎన్నికల్లో సినీతారలు కూడా ఓట్లు వేసేందుకు ఉత్సహం చూపిస్తున్నారు. మరి ఏ సెలబ్రటీ ఎక్కడ ఓటు వేయనున్నాడో చూస్తే..ఇప్పటికే చిరంజీవి దంపతులు జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగార్జున కుటుంబ సమేతంగా అమల, సమంత, అఖిల్, నాగ చైతన్యాలతో కలిసి తెలంగాణ వుమెన్ కోపరేట్ సోసైటీ సెంటర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అల్లు అర్జున్, అల్లు స్నేహ, అల్లు శిరీష్‌లు తమ ఇంటి ముందే ఉన్న ఉలవచారు రెస్టారెంట్‌కు వెళ్లే దారిలో తమ ఓటు వేయనున్నారు. మహేష్, నమ్రత, సరేష్, కృష్ణ వీరు భారతీయ విద్యభవన్ జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కును వినియోగించనున్నారు. ఎన్‌టీఆర్ తన కుంటుంబ సమేతంగా ఓబులరెడ్డి స్కూల్ కేంద్రంలో ఓటును నమోదు చేయనున్నారు. సురేష్ బాబు, రానాలు ఫిలింనగర్ సీనీ క్లబ్‌లో ఓటును హక్కును వినియోగించనున్నారు. దర్శకధీరుడు రాజమౌళి ఇంటర్నేషనల్ స్కూల్ షెక్ పేట్ పోలింగ్ కేంద్రంలో ఓటును నమోదు చేయనున్నారు.