నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో సింహ , లెజెండ్ చిత్రాలు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడమే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించి అభిమానులను ఆనందపరిచాయి. దీంతో మరోసారి వీరిద్దరి కాంబో సినిమా అనగానే అందరిలో అంచనాలు మొదలయ్యాయి.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా తాలూకా అనేక వార్తలు బయటకు వస్తూ సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడనే వార్త ఇప్పుడు నందమూరి అభిమానుల్లో సంతోషం నింపుతుంది. కళ్యాణ్ రామ్ పాత్ర ఇంటర్వెల్ లో వస్తోందని.. పోలీస్ ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్ కనిపిస్తాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందొ తెలియదు కానీ ఇది నిజమైతే నందమూరి అభిమానులకు పండగే. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.