హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలపై రాజకీయ నేతలు , రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. అంతే కాదు తెలుగు రాష్ట్రాల ప్రజలు గ్రేటర్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అధికారులు పోలింగ్ కు సంబందించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. ఇదిలా ఉంటె గ్రేటర్ ఎన్నికల ఫై కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో హైలైట్ అయ్యారు.
హైదరాబాద్ సికింద్రాబాద్‌లో జరుగుతున్న ఎన్నికల్లో మార్పు తేవాలి, మార్పు కావాలి అన్నారు పాల్. విలువైన ఓటును అమ్ముకోవద్దన్నారు. కులాలకు మతాలకు అతీతంగా ఓటు వేయాలని గ్రేటర్ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అతి త్వరలోనే హైదరాబాద్ వస్తున్నా అన్నారు. తెలంగాణ, ఆంధ్రాలో గొప్ప మార్పు వస్తుందన్నారు.