సూపర్ స్టార్ రజనీకాంత్ ..రాజకీయ ఎంట్రీ కోసం యావత్ సినీ అభిమానులు , తమిళ్ ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సోమవారం తన అభిమాన సంఘాల నాయకులతో చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమండపంలో రజినీ సమావేశం ఏర్పటు చేయడం తో ఈరోజు పొలిటికల్ ఎంట్రీ ప్రకటన ఖరారు అని అంత అనుకున్నారు కానీ..ఎప్పటి మాదిరిగానే మరోసారి ప్రకటనకు వాయిదా వేశారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రవేశంపై వీలైనంత తర్వగా నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు. మక్కళ మండ్రం సభ్యులతో తన అభిప్రాయాలను పంచుకున్నానని తెలిపారు. మక్కళ మండ్రంలోని లోటుపాట్ల గురించి చర్చించినట్టు రజని వివరించారు.
రజనీకాంత్ రాజకీయ ప్రవేశం సుమారు పాతికేళ్లుగా నలుగుతున్న విషయం. ఆయన రాజకీయాల్లోకి వస్తారా? లేదా? అనే విషయమై 1996వ ఏడాది నుంచి చర్చ జరుగుతుండగా.. మూడేళ్ల క్రితం రజనీ ఆ ఉత్కంఠకు తెరదించారు. ప్రకటన చేసినా క్రియాశీలక రాజకీయాలకు కూడా దూరంగానే ఉన్నారు. దీంతో ఆయన రాజకీయ అరంగేట్రం రాష్ట్ర రాజకీయాల్లో చర్చలకే పరిమితమైంది. ఇదిలా ఉండగా.. ఆరోగ్య కారణాల దృష్ట్యా రజనీ తన రాజకీయ ఆలోచన విరమించుకోవాలని వైద్యులు సూచించినట్లు ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.