నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీ లో ఓ సపరేట్..తనకు ఏమనిపిస్తే అది చేస్తాడు..ఏమాట్లాడాలనిపిస్తే అది అంటాడు. ఆ మధ్య టాలీవుడ్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో చిరంజీవి, నాగార్జున తో పాటు కొంతమంది వ్యక్తులు చర్చలు మొదలుపెడితే.. భూములు పంచుకోవడం కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాళ్లంతా కలిశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం రేపాడు.
ఇక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సినీపరిశ్రమకు రాయితీలు ఇవ్వడంతో పాటు థియేటర్లు తెరిచేందుకు అనుమతులు ఇవ్వడం తో చిరు , నాగార్జున లు కృషి ఉంది. మరి ఈ విషయంలో బాలయ్య ఏమని కామెంట్స్ చేస్తాడో అని అంత ఎదురుచూస్తున్నారు. అప్పుడు చిరు-నాగ్ ముందుకొచ్చి చర్చలు ప్రారంభిస్తే “రియల్ ఎస్టేట్” అంటూ కాంట్రవర్సీ స్టేట్ మెంట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఇప్పుడు ఏమంటారంటూ టాలీవుడ్ లో ఓ వర్గం ప్రశ్నిస్తోంది. చూద్దాం బాలయ్య మెచ్చుకుంటాడో..లేక వివాదం రేపుతాడో ..