హైదరాబాద్‌లో 2019 లో జరిగిన ఘోర సామూహిక అత్యాచార ఘటన ఆధారంగా రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న సినిమా ‘దిశాఎన్‌కౌంటర్’. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రానికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని నిలిపివేయాలని నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.
వీరి తరుపున వాదిస్తున్న లాయర్ కృష్ణామూర్తి ..ఎన్ కౌంటర్ కు గురైన కుటుంబాలు ఇప్పటికే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని..ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించి, వారిని ఊరిలో కూడా ఉండనివ్వకుండా చేస్తున్నారన్నారని వాపోయాడు. ఈ చిత్రంలో వారిని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని కోర్టుకు తెలిపాడు. ఈ చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని ..దిశ సంఘటనపై ఒక పక్క జ్యుడీషియల్ కమిషన్ విచారణ జరుగుతున్న ఎలా చిత్రం తీస్తారని కోర్టుకు కృష్ణమూర్తి తెలిపాడు. వెంటనే చిత్రం విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. మరి ఫైనల్ గా ఏ తీర్పు ఇస్తుందో అని చిత్ర యూనిట్ టెన్షన్ పడుతున్నారు.