మెగాస్టార్ చిరంజీవి నుండి సినిమా వస్తుందంటే మెగా అభిమానుల్లో పండగే..బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల సునామి సృష్టించాల్సిందే. అందుకే చిరంజీవి తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు పోటీ పడుతుంటారు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే వేదాళం రీమేక్ , అలాగే లూసిఫర్ చిత్రాల రీమేక్ లలో నటించేందుకు ఓకే చెప్పాడు.
ఈ నేపథ్యంలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తోన్నఆచార్య చిత్రానికి చిరంజీవి రూ.50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఆచార్య తర్వాత చేయనున్న చిత్రాలకు పారితోషికం పెంచుతున్నట్టు చిరంజీవి చెప్పాడట. అనిల్ సుంకర నిర్మించనున్న వేదాళం రీమేక్ కు ఏకంగా రూ.60 కోట్లు రెమ్యునరేషన్ ను అడిగినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అసలే కరోనా టైం..అందులోనూ గత కొంతకాలంగా థియేటర్స్ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంత భారీ ఎత్తున రెమ్యూనరేషన్ అడగడం ఫై అంత మాట్లాడుకుంటున్నారు. మరి నిజంగా చిరు అంత అడిగాడా..లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.