మెగా డాటర్ చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల ఆమె భర్త విష్ణుప్రసాద్ కలిసి ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ప్రముఖ ఓటీటీ సంస్థతో జీ 5 తో కలిసి ఒక వెబ్ సిరీస్ నిర్మిస్తున్నసంగతి తెలిసిందే. దీనికి ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ టైటిల్ ఖరారు చేశారు.
ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నందిని రాయ్, నిహారిక ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ వెబ్ సిరీస్‌కు ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్నారు. 2015 ఏప్రిల్ 7న ఆలేరులో జరిగిన వికారుద్దీన్ ఎన్‌కౌంటర్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. వాస్తవ ఘటనలకు కాస్త కల్పిత కథను జతచేసి ఉగ్రవాదం నేపథ్యంలో ఈ కాప్ డ్రామాను రూపొందిస్తున్నారు. 8 ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు వెబ్ సిరీస్‌పై ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ వివాదంలో చిక్కుకుంది.
ఈ వెబ్ సిరీస్ ను ఆపాలని ఎంబీటీ నేత అంజదుల్లా ఖాన్ డిమాండ్ చేసారు. వికార్ ఇస్స్యూ లో అందరిని దోషులు గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మరో వైపు వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్ అయ్యాక ఇప్పటి వరకు ‘ ఎన్హెచ్ఆర్సి’ ఇవ్వాలన్నా..నష్టపరిహారాన్ని ఇంతవరకు ఇవ్వలేదని అంటున్నారు వికార్ కుటుంబ సభ్యులు. అయితే నిందితుల కుటుంబాల నుంచి వెబ్ సిరీస్ నిర్వాహకులు ఇంతవరకు అనుమతులు తీసుకోలేదని.. వెంటనే షూట్ అవుట్ ఎట్ ఆలేరు ప్రోమోలను ఆపాలని ఎంబీటీ డిమాండ్ చేస్తుంది. మరి ఈవివాదం ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.