టాలీవుడ్ చందమామ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ నెల 30వ తారీఖున ప్రేమించిన గౌతమి పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతుంది. కాజల్ పెళ్లి అనగానే ఆమె అభిమానులు మరియు సినీ వర్గాల వారు భారీగా ఊహించుకుంటున్నారు. కరోనా కారణంగా అభిమానులకు మరియు బంధు మిత్రులు తక్కువ వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లికి కేవలం 20 మంది కంటే తక్కువ హాజరు కాబోతున్నట్లు గా పేర్కొన్నారు.
కాజల్ మరియు గౌతమ్ల కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వివాహంకు హాజరు కాబోతున్నారట. ఇక ఈ వేడుక బయట ఎక్కడో కాకుండా ఇంట్లోనే జరగబోతున్న ట్లుగా కూడా కాజల్ అగర్వాల్ కుటుంబ సభ్యులు తెలియజేశారు. మామూలుగా ఏ హీరోయిన్ లేదా సెలబ్రెటీ పెళ్లి అయినా కూడా భారీ కన్వెన్షన్ లో జరుగుతాయి. కాని కాజల్ అగర్వాల్ పెళ్లి మాత్రం ఇంట్లోనే సింపుల్ గా జరగడం పట్ల ఆమె అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాజల్ పెళ్లి అనగానే హీరోలు హీరోయిన్ సంగీత్ లో పాల్గొనడం డ్యాన్స్ లు వేయడం పాటలు పాడడం ఉంటాయని అంతా ఆశించారు. కానీ అవేవి ఉండకుండా సింపుల్ గా కాజల్ పెళ్లి జరిగి పోతుంది అని అంటున్నారు.
ఇప్పటికి నిశ్చితార్థం విషయంలో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు ఒక్కటి కూడా విడుదల చేయకపోవడంపై కోపంతో ఉన్నారు. ఇప్పుడు పెళ్లి కూడా సింపుల్ గా చేసుకోబోతున్న నేపద్యంలో అభిమానులు మళ్లీ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులు మాత్రం కరోనా సమయంలో ఇలా సింపుల్ గా పెళ్లి చేసుకోవాలనుకోవడం మంచి నిర్ణయం అంటూ అభినందిస్తున్నారు. పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ సినిమాల్లో నటించేందుకు రెడీగా ఉన్న విషయం తెల్సిందే.