టాలీవుడ్ చందమా కాజల్ అగర్వాల్ తన పెళ్లి వార్తతో అందరికి షాక్ ఇచ్చింది. కొన్నాళ్ళుగా పరిచయం ఉన్న తన స్నేహితుడు గౌతం కొచ్లుతోనే కాజల్ పెళ్లికి సిద్ధమైంది. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరుపుకున్న కాజల్ ఈ నెల 30న మ్యారేజ్ డేట్ అంటూ ఈమధ్యనే ఎనౌన్స్ చేసింది. కాజల్ పెళ్లి వార్త విని ఆమె హార్డ్ కోర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అదేంటి శుభమాని పెళ్లిచేసుకుంటుంటే ఇలా హర్ట్ అవ్వడం ఏంటని అనుకోవచ్చు తమ అభిమాన అందాల నటి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైతే ఎలా అనుకుంటూ వారు బెంగ పెట్టుకున్నారు.
వారి కోసమే పెళ్లైనా సరే తను సినిమాలు చేయడం మాత్రం ఆపనని చెబుతుంది కాజల్ అగర్వాల్. పుష్కర కాలం నుండి తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న కాజల్ ఇప్పటికి సూపర్ ఫాంలో ఉంది. మధ్యలో కొంత కెరియర్ అటు ఇటుగా అనిపించినా మళ్ళీ సెట్ రైట్ అయ్యింది. వరుస స్టార్ ఛాన్సులు అందుకుంటున్న కాజల్ పెళ్ళి తర్వాత కూడా ఇదే జోష్ కనబరచాలని చూస్తుంది. అయితే అనుకున్నత రేంజ్ లో కాకపోయినా కాజల్ పెళ్ళి తర్వ్వాత కూడా నటిస్తానని చెబుతుంది. ఆ మాటతో ఆమె ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషిగా ఉన్నారు.
ఆల్రెడీ అక్కినేని కోడలు సమంత పెళ్లి తర్వాత కూడా తన ఫాం కొనసాగిస్తుంది. కమర్షియల్ సినిమాల కన్నా అమ్మడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. మరి సమంత బాటలో కాజల్ అలానే కెరియర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తుందా లేదా అన్నది చూడాలి.