మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత సినిమాతో తెరంగేట్రం చేశాడు రాం చరణ్. ఆ తర్వాత ఒక్కో సినిమాతో హిట్ అందుకుంటూ మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. రంగస్థలం సినిమాతో నటుడిగా తనని తాను గెలిచాడు చరణ్. అంతేకాదు ఇది కదా చిరు తనయుడి అభినయం అంటే ఇదని మెగా ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగురేసేలా చేశాడు. రంగస్థలం తర్వాత వినయ విధేయ రామ సినిమా పోయినా ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు రాం చరణ్.
రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రాం చరణ్ తో పాటుగా ఎన్.టి.ఆర్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలాఉంటే చరణ్ తన సినిమాలనే కాదు చిరుకి సంబందించిన కథా చర్చల్లో కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత చిరు ఏ సినిమా చేయాలనేది చరణ్ నిర్ణయిస్తున్నారట. ఒకప్పుడు చరణ్ సినిమాల విషయంలో చిరుది డెశిషన్ ఫైనల్ ఉండేది కాని ఇప్పుడు సీన్ మారిందని తెలుస్తుంది. చరణ్ కు నచ్చితే చిరుకి నచ్చినట్టే అని తెలుస్తుంది.
చరణ్ కు నచ్చబట్టే చిరు ఆచార్య తర్వాత బాబీ, మెహెర్ రమేష్, వినాయక్ లాంటి డైరక్టర్స్ తో సినిమాలు ఫిక్స్ చేసుకున్నాడని అంటున్నారు. మొత్తానికి తండ్రి ఎలాంటి సినిమాలు చేయాలి అన్న రేంజ్ కి ఎదిగాడు రాం చరణ్. హీరోగా చేస్తూనే నిర్మాతగా కొణిదెల బ్యానర్ బాధ్యతలను చూస్తున్నాడు. ఇక మరోపక్క చిరు సినిమాలను పర్యవేక్షిస్తున్నాడు. ఓ విధంగా చరణ్ ఇప్పుడు అన్నివిధాలుగా పర్ఫెక్ట్ గా ఉన్నాడని చెప్పొచ్చు.