బిగ్ బాస్ మొదటి మూడు సీజన్లకు వేరు వేరు స్టార్స్ హోస్ట్ లుగా వ్యవహరించారు. మొదటి ఎన్టీఆర్ రెండో సీజన్ కు నాని మూడవ సీజన్ కు నాగార్జున హోస్టింగ్ చేశాడు. ఇక నాల్గవ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్లో కూడా నాగార్జున ఒక వారం పాటు హోస్టింగ్ కు దూరంగా ఉండబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
గత సీజన్ లో పుట్టిన రోజు సందర్భంగా విదేశాలకు వెళ్లిన నాగార్జున హోస్టింగ్ కు దూరంగా ఉండటం వల్ల ఆ టైంలో రమ్యకృష్ణ హోస్ట్ గా వ్యవహరించేలా చేశారు. ఇక ఆమెను మరోసారి ఈ సీజన్ కి కూడా హోస్టుగా వ్యవహరింప చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం థాయిలాండ్ వెళ్లిన నాగార్జున మరో వారం రోజుల పాటు వచ్చే అవకాశం లేదని ఆ కారణంగానే ఈ వీకెండ్ ఎపిసోడ్ రమ్యకృష్ణతో లాగించేయాలనే నిర్ణయానికి నిర్వాహకులు వచ్చారంటూ బుల్లి తెర మరియు వెండి తెర వర్గాల ద్వారా సమాచార అందుతోంది.
గత సీజన్లో రమ్యకృష్ణ చేసిన ఎపిసోడ్ మంచి ఆదరణ లభించింది. అందుకే ఈ సీజన్ లో కూడా ఆమెనే హోస్ట్ గా చూపిస్తే బాగుంటుందని నిర్వాహకులు నిర్ణయానికి వచ్చారు. ప్రత్యేకంగా ఆమెతో హోస్టింగ్ చేయించడం వల్ల గెస్ట్ హౌస్ అంటూ ప్రచారం చేసి మంచి రేటింగ్ ను దక్కించుకునే అవకాశం ఉంది. మొత్తానికి రేపటి ఎపిసోడ్ కు నాగార్జున వస్తాడా లేదా రమ్యకృష్ణతో పని కానిచ్చేస్తారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. రేపటి ఎపిసోడ్ యాంకర్ ఎవరు అనే విషయం లో అంతటా ఉత్కంఠ నెలకొని ఉంది.