జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక హాట్ టాపిక్ తో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తన హాట్ ఫోటోలను మరియు రెగ్యులర్ అప్డేట్ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా చేసే అనసూయ ఇటీవల తన భర్త భరద్వాజ్ పుట్టిన రోజు సందర్భంగా గోవాలో వేడుకలు నిర్వహించారు. ఆ సందర్భంగా ఆమె తీసుకున్న ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆ పోస్టులకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మిని స్కర్ట్ లో ఉన్న ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలకు తాను హిందూ సముద్రం వద్ద ఉన్నట్లుగా పేర్కొని కామెంట్ పెట్టింది. ఆ పోస్ట్ కాస్త ఆమె యాంటీ ఫ్యాన్స్ కు బుక్ అయ్యేలా చేసింది. కొందరు ఆమెను ఎప్పుడూ క్రిటిసైజ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఈసారి కూడా ఆమెను విమర్శించేందుకు అది హిందూ మహాసముద్రం కాదు తల్లి అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
గోవా లో హిందూ మహా సముద్రం ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ఆమెపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. చాలా మంది చాలా రకాలుగా ఆమెను కార్నర్ చేయడంతో స్వయంగా ఆమె సోషల్ మీడియా లో క్లారిటీ ఇచ్చింది. మీలాంటి హాఫ్ మైండ్ గాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదు అంటూనే తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చింది.
వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని సేకరించి తాను చెప్పింది నిజమే అది హిందూ సముద్రమే అరేబియా సముద్రం లోని ఒక భాగం అంటూ క్లారిటీ గా వికీపీడియా స్క్రీన్ షాట్ ను తీసి ఇచ్చింది. దాంతో ఆమె ను విమర్శించిన వాళ్ళంతా నోరు మూసుకున్నారు. ఆమె అభిమానులు మీ తెలివి అమోఘం అనసూయ అంటూ ప్రశంసలు కురిపించారు. బుల్లితెర పైనే కాకుండా వెండి తెరపై కూడా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న ముద్దుగుమ్మ అనసూయ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఇలాంటి వైరల్ విషయాలతో ప్రేమ సాగుతూనే ఉంది.