బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసు ను కేంద్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది నేపథ్యంలో అంతా కూడా చాలా ఆసక్తిగా ఆ విషయంలో ఏమైనా సంచలన విషయాలు బయటకు వస్తాయా అంటూ ఎదురు చూశారు. సుశాంత్ మృతి వెనుక బాలీవుడ్ వర్గాల వారు ఉన్నారని కొందరు రియా చక్రవర్తి వల్లే సుశాంత్ మృతి చెందాడు అంటూ మరికొందరు సోషల్ మీడియా ద్వారా ఆరోపించారు. మొత్తానికి సిబిఐ ఎంక్వైరీ ద్వారా సుశాంత్ కేసు విషయంలో చాలా పెద్ద విషయాలు బయటకు వస్తాయని నమ్మకం పెట్టుకున్నారు. కానీ కేసును సిబిఐ వారు విచారించడం వల్ల డ్రగ్స్ కేసు బయట పడింది తప్ప సుశాంత్ ది హత్య అనే సాక్ష్యాలు లభించలేదు.
సుశాంత్ కేసు విషయంలో మాత్రం ఎలాంటి అనుమానాలు కానీ ఇతర సాక్ష్యాలు కానీ వెలుగులోకి రాలేదు. ఇది పూర్తిగా ఆత్మహత్య అంటూ క్లారిటీ వచ్చేసిందట. ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ వారు సుశాంత్ కు ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లుగా క్లారిటీ గా పేర్కొన్నారట. వారి రిపోర్ట్ ప్రకారం సీబీఐ వారు సుశాంత్ కేసును క్లోజ్ చేసే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ కేసుతో బాలీవుడ్ లో ఎవ్వరికీ సంబంధం లేదని అలాగే ముంబై పోలీసులు ఈ కేసును సమగ్ర అందంగానే ఎంక్వయిరీ చేశారని క్లారిటీ వచ్చేసింది.
ఈ కేసు వల్ల బయట పడ్డ డ్రగ్స్ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతోందో అంటూ అంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు జైల్లోనే ఉన్నారు. సుశాంత్ కేసు నుండి వారు బయటపడ్డ డ్రగ్స్ కేసులో మాత్రం వాళ్లు చాలా బలంగా బుక్ అయినట్లుగా అనిపిస్తుంది అంటూ జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి.