మహమ్మారి కరోనా వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కాటు వేస్తూనే ఉంది. దేశంలో ఇప్పటికే లక్షలాది మందికి కరోనా పాజిటివ్ అంటూ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కొందరికి కరోనా వచ్చి దాని అంతట అదే పోతున్నట్లుగా కూడా భావిస్తున్నారు. సినీ ప్రముఖులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా బారిన పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇటీవలే మిల్కీ బ్యూటీ తమన్నా స్వయంగా సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందని వెల్లడించిన విషయం తెలిసిందే. కరోనా బారిన పడుతున్న ప్రతి ఒక్క సెలబ్రిటీలు కూడా తమతో కలిసిన వారు అంతా కూడా క్వారెంటైన్ కు వెళ్లాలని అలాగే పరీక్ష కూడా చేయించుకోవాలంటూ సూచిస్తున్నారు. ఆ విషయంలో ఇప్పటికే చాలా మంది జాగ్రత్తగా ఉంటున్నారు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు కరోనా నిర్ధారణ అయ్యింది అని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. షూటింగ్ సందర్భంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా కరోనా అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా షూటింగ్ లో ఇటీవల పాల్గొన్న సందర్భంగా సాయి ధరమ్ తేజ్ కు కరోనా పాజిటివ్ సోకి ఉంటుందంటూ మీడియా వర్గాల్లో మరియు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఆయన ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని ఏ మాత్రం లక్షణాలు లేవని సాధారణ చెక్ అప్ లో భాగంగా మాత్రమే ఆయనకు టెస్ట్ చేయించగా కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని ఆయన సన్నిహితులు అంటున్నారు. తేజ్ ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు అంటున్నారు. మెగా అభిమానులు ఈ విషయంలో ధైర్యంగా ఉండాలని చెబుతున్నారు. మెగా ఫ్యామిలీ కి సంబంధించి ఇదే మొదటి కరోనా కేసు గా చెబుతున్నారు.