తెలుగు బిగ్ బాస్ లో మూడవ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా హౌస్ లోకి ప్రవేశించిన స్వాతి దీక్షిత్ అనూహ్యంగా మొదటి వారంలోనే వెనుదిరగడం అందరికీ షాకింగ్ గా అనిపించింది. ఆమె ఖచ్చితంగా హౌస్ లో కొన్ని వారాల పాటు ఉంటుంది అంటూ అంత నమ్మకంగా ఉన్నారు. హౌస్ లో ఉన్న మగ వారు ఆమెతో పులిహోర కలిపేందుకు చాలా ఆసక్తి చూపించారు.
వెళ్ళిన మొదటి రోజే ఆమె చుట్టూ మగవాళ్ళంతా చేరి నానా హడావుడి చేశారు. ఆ కారణంగా ఆమె కనీసం నాలుగైదు వారాలు అయినా హౌస్ లో ఉంటుంది అంటూ నమ్మకంగా ఉన్నారు. కానీ అనూహ్య పరిణామాల మధ్య ఆమె మొదటి వారంలోనే ఎలిమినేషన్ కు నామినేట్ అయింది.
ఈ వారమే కొత్తగా వచ్చారు కనుక నిన్ను ప్రేక్షకులు సేవ్ చేస్తారు అంటూ అమ్మ రాజశేఖర్ ఆమెను నామినేట్ చేశాడు. సిల్లీ కారణంగా నామినేట్ అయిన స్వాతి దీక్షిత్ సేవ్ అవుతుంది అని అనుకున్నారు. మెహబూబా వారు ఎలిమినేషన్ లో ఉన్నారు కనుక వారి కంటే స్వాతికి కచ్చితంగా ఎక్కువ ఓట్లు వస్తాయని అంతా భావించారు. కానీ స్వాతికి తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా ఎలిమినేట్ చేస్తున్నట్లు నాగార్జున ప్రకటించాడు.
ఆట ఆడే వారు మరియు ఎంటర్టైన్మెంట్ చేసే వారిని మాత్రమే ప్రేక్షకులు బిగ్ బాస్ హౌస్ లో ఉంచాలని భావిస్తున్నారని అందుకే స్వాతి దీక్షిత్ ను ఎలిమినేట్ చేశారని నాగార్జున చెప్పడం జరిగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్వాతి మాట్లాడుతూ నాగార్జున గారు అలా మాట్లాడటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అని స్వాతి చెప్పుకొచ్చింది.
నేను హౌస్ లో ఉన్న పది రోజులు నా వరకు నేను ఆట ఆడడం తో పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు చాలా కృషి చేశానని స్వాతి చెప్పింది. అయినా కూడా నాగార్జున గారు అలా అనడం నాకు చాలా బాధగా అనిపించింది అంటూ నాగార్జున మాటలకు ఆవేదన వ్యక్తం చేసింది.