టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో లేదా ఇతర మీడియా లో ఎప్పుడూ ఒకే ప్రశ్న ఎదుర్కొంటోంది. అదే మీరు ఎప్పుడు తల్లి కాబోతున్నారు. ఈ ప్రశ్నకు సమంత అనేకసార్లు సమాధానం చెప్పింది ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న నేను అమ్మ అవ్వాలని ఆశ ఉన్నా కూడా కొన్ని రోజులు వెయిట్ చేయాలి అనుకుంటున్నట్లుగా చెప్పింది. అయినా కూడా అభిమానులు మళ్లీ మళ్లీ అదే ప్రశ్నను ఆమెను వేస్తున్నారు.
తాజాగా సమంత సోషల్ మీడియాలో అనుష్క శర్మ ఫోటోకి కామెంట్ పెట్టింది. గర్భవతి అయిన అనుష్క శర్మ ను చూసిన సమంత మీరు దేవతల కనిపిస్తున్నారు అంటూ కామెంట్ పెట్టడంతో ఇప్పుడు అందరూ కూడా సమంతను దేవతల చూడాలనుకుంటున్నాను అంటూ తెగ హడావుడి చేస్తున్నారు. ఆమె సోషల్ మీడియా పోస్టులకు మీరు దేవత ఎప్పుడు అవ్వబోతున్నారు మిమ్మలను అమ్మగా చూడాలనుకుంటున్నాము అంటూ పదే పదే కామెంట్స్ తో విచ్చేస్తున్నారు. ఇప్పటికే తనకు అమ్మ అవ్వాలని ఆశ ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది అంటూ చెబుతోంది.
హీరోయిన్ గా తాను చేయాల్సిన ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత అమ్మ అవ్వాలనుకుంటున్నట్లుగా సమంత స్వయంగా చెప్పింది. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలు మరియు ఇతర విషయాల పై ఉందని ఈ సమయంలో అమ్మగా పూర్తి న్యాయం చేయలేం ఏమో అంటూ సమంత ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మళ్ళీ ఆమెను అమ్మగా ఎప్పుడు మారబోతున్నారు అంటూ ప్రశ్నించడం అవివేకం అంటూ మీడియా వర్గాల వారిని ఆమె సన్నిహితులు హెచ్చరిస్తున్నారు.