రెండు వారాలుగా చప్పగా సాగుతూ వస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఈవారం రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో ఎలిమినేషన్ విషయంలో ఇంటి సభ్యుల మధ్య రసవత్తరమైన చర్చ జరిగింది. ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటూ తమకు కోపం అనిపించిన వారి ఫోటోలను మంటల్లో తగలేసి మరి తమ కోపాన్ని ప్రదర్శించారు. ముందు ముందు ఈ గొడవలు మరింతగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఇక ఈ వారం ఎలిమినేషన్ కి నామినేషన్ ఆయన కుమార్ సాయి వీక్ కంటెస్టెంట్ గా కనిపిస్తున్నాడు. ప్రేక్షకులు గతవారమే అతన్ని ఇంటికి పంపిస్తారు అని అంతా భావించారు. కానీ కరాటే కళ్యాణి వల్ల లక్ కలిసి వచ్చింది. ఈసారికి వెళ్లిపోవడం ఖాయం అనిపిస్తుంది. పోయిన వారంలో లక్ దక్కించుకున్న కుమార్ స్థాయి ఈసారి మాత్రం తప్పించుకునే అవకాశం లేదు అనిపిస్తుంది.
హౌస్ లోకి ఎంటర్ అయ్యి వారం దాటినా కూడా ఇప్పటి వరకు ప్రత్యేకతను చాటుకోలేకపోయాడు. దానికి తోడు ఇంటి సభ్యులతో అతడు ప్రవర్తించిన తీరు కూడా ఏమాత్రం తగ్గలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడు శని లేదా ఆదివారాల్లో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని ఇప్పటి నుండే బుల్లితెర వర్గాలు మరియు సోషల్ మీడియా జనాలు అనుకుంటున్నారు.
కుమార్ సాయి కాకుండా ఈ పారం అరియానా, మోనాల్ గజ్జర్, హారిక, మెహబూబు, లాస్య మరియు టీవీ9 లు కూడా నామినేట్ అయ్యారు. కానీ వీరందరిలో కి కుమార్ సాయి మాత్రమే వీక్ కంటెస్టెంట్ గా కనిపిస్తున్నాడు. కనుక ఈ వారం మూడేది కుమార్ సాయికే అంటూ బలంగా వాదనలు వినిపిస్తున్నాయి.