నందమూరి బాలకృష్ణ, బోయపాటి ల కాంబినేషన్ లో ఇప్పటి వరకు రెండు సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా సింహా సినిమా బాలయ్య ఆల్ టైమ్ సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. లెజెండ్ సినిమా కూడా భారీ వసూళ్లను దక్కించుకొని బాలయ్య కెరీర్ లో కీలకమైన మూవీగా నిలిచింది. అలాంటి రెండు బిగ్గెస్ట్ సినిమాలు బాలయ్య కు ఇచ్చిన బోయపాటి శ్రీను ప్రస్తుతం మరో సినిమాను ఆయనతో చేస్తున్న విషయం తెలిసిందే.
వీరిద్దరి కాంబోలో కచ్చితంగా హ్యాట్రిక్ నమోదు అవ్వడం ఖాయం అంటూ నందమూరి అభిమానులతో పాటు సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా దసరా వరకు రావాల్సి ఉన్నా కరోనా కారణంగా షూటింగ్ పూర్తి కాలేదు. గత ఆరు నెలలుగా షూటింగ్ ఆగిపోయింది.
మళ్లీ సినిమా షూటింగ్ ను త్వరలో పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకోసం హీరోయిన్ ఎంపిక మొదలు పెట్టినట్లు గా సమాచారం అందుతోంది. బాలీవుడ్ కి చెందిన ఒక హీరోయిన్ ను ఈ సినిమా కోసం సంప్రదించినట్లు గా కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఆమె కొన్ని కారణాల వల్ల నో చెప్పడంతో ఇప్పుడు మళ్లీ బాలయ్య కోసం హీరోయిన్ వేటలో బోయపాటి ఉన్నాడు.
గత కొన్ని రోజులుగా బాలీవుడ్ కు చెందిన కొందరు మోడల్స్ ను మరియు నటీనటుల హీరోయిన్స్ ను ఆడిషన్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముంబైలో పలువురు ముద్దుగుమ్మలకు బోయపాటి శ్రీను పరీక్షలు పెట్టి వారికి స్క్రీన్ టెస్టు కూడా చేసి వారిలో ఒకరిని ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే బాలయ్యకు తగ్గ హీరోయిన్ ని ఆయన ఎంపిక చేస్తారని ఆశిద్దాం. సింహా, లెజెండ్ స్థాయిలో వీరిద్దరి కాంబో సినిమా ఉంటుందని నందమూరి అభిమానులు పెట్టుకున్న అంచనాలు ఏ స్థాయి వరకు రీచ్ అవుతాయో చూడాలి.
ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు షూటింగ్ చాలా బ్యాలెన్స్ ఉన్న కారణంగా ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసే అవకాశం ఉందని సినిమా వర్గాల వారు అంచనా వేస్తున్నారు.