కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని ఇండస్ట్రీల్లో ఉంది. కాని హీరోయిన్స్ కాస్త జాగ్రత్తగా ఉంటే వాటి నుండి బయట పడవచ్చు అని, కొందరు హీరోయిన్స్ తమను అఘాయిత్యం చేశారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు కాని ఆ విషయంలో నిజం ఉందని తాను భావించడం లేదు అంటూ గతంలో ఒక హీరోయిన్ చెప్పుకొచ్చింది. తాజాగా పాయల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక దర్శకుడు తనను అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు అంది. నన్ను సమ్మతం అడిగిన ఆ దర్శకుడు ఒప్పుకోకుంటే బలత్కారం చేస్తాడు అనిపించింది.
ఖచ్చితంగా అతడి నుండి నేను సేవ్ అవ్వాలనుకుని జాగ్రత్తగా అక్కడి నుండి పారిపోయాను అంటూ పాయల్ ఘోష్ అంది. తాజాగా ఈమె మాట్లాడుతూ నన్ను ఒక దర్శకుడు గదిలోకి తీసుకు వెళ్లాడు. దర్శకుడు పిలిచిన సమయంలో వెళ్లకుంటే పరిస్థతి వేరేగా ఉంటుంది. కనుక వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత అతడు నాకు మెల్లగా వీడియోలు చూపించడం మొదలు పెట్టాడు. అందులో కొన్ని బ్లూ ఫిల్మ్‌లు కూడా ఉన్నాయి. వాటిని చూపిస్తూ నన్ను అసభ్యంగా టచ్ చేసేందుకు ప్రయత్నించాడు.
ఆ సమయంలో నేను వెంటనే అక్కడ నుండి వెళ్లాలని అనుకున్నాయి. అయితే నేను బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తే అతడు నన్ను బలత్కారం చేసే అవకాశం ఉంది. అందుకే ఆరోగ్యం బాగాలేదు అంటూ చెప్పి అక్కడ నుండి బయట పడ్డాను. అతడి నుండి చాలా దూరం వచ్చేశాను. ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్‌గా జరుగుతుంటాయి. కాని నేను మాత్రం ఎప్పుడు బాలీవుడ్ లో ఇలాంంటివ ఆటితో ఇబ్బంది పడ్డ సందర్బాలు లేవు అంది.
ఇక స్టార్స్ కు చాలా మందికి డ్రగ్స్ అలవాటు ఉంటుంది. పార్టీలకు వెళ్లినప్పుడు అనుకోకుండా డ్రగ్స్ తీసుకుంటారు. కావాలని తీసుకోకున్నా పార్టీని ఎంజాయ్ చేసేందుకు డ్రగ్స్ తీసుకుంటారు. ఎక్కవ శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారు కాని బానిసలు అయితే కారు అంది.