అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన వారు ఈమద్య కాలంలో నిరాశపర్చుతూనే ఉన్నారు. నాగేశ్వరరావు వారసుడిగా వచ్చిన నాగార్జున టాలీవుడ్ స్టార్ హీరో అయ్యాడు. ఆ తర్వాత అక్కనేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలు ఎవరు కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ లు దక్కించుకోలేక పోయారు. సుమంత్, నాగచైతన్యలు ఒక స్థాయి వరకే ఆగిపోయారు. ఆ సమయంలో వచ్చిన అఖిల్ ఖచ్చితంగా రికార్డు బ్రేకింగ్ లు సాధించడం కన్ఫర్మ్ అనుకున్నారు. కాని మొదటి మూడు సినిమాలతో అఖిల్ వారిని నిరాశపర్చాడు.
ప్రిన్స్ అఖిల్ హీరోగా చేసిన మొదటి సినిమా అఖిల్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత చేసిన హలో మరియు మిస్టర్ మజ్ను సినిమాలు కూడా సో సో గానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో అఖిల్ చేస్తున్న నాల్గవ సినిమా ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు కనుక ఏ మేరకు సినిమా హిట్ అవుతుంది అనే విషయంలో క్లారిటీ లేదు. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి విడుదలకు సిద్దంగా ఉన్న సమయంలో కరోనా రావడంతో విడుదల ఆపేశారు.
ఇప్పుడు అఖిల్ 5వ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనీల్ సుంకర నిర్మాణంలో అఖిల్ 5 మూవీ పట్టాలెక్కబోతుంది. అందుకు సంబంధించిన ప్రకటన వచ్చినప్పటి నుండి కూడా సినిమా గురించి పెద్ద ఎత్తను చర్చ జరుగుతోంది. చరణ్ ఈ కథను స్వయంగా అఖిల్ కు పంపించాడు అంటున్నారు. సైరా సమయంలో చరణ్ కోసం ఈ కథను సురేందర్ రెడ్డి వినిపించాడట. తప్పకుండా నటించాలని చరణ్ కూడా భావించాడట. అయితే ప్రస్తుత సమయంలో అఖిల్‌కు సక్సెస్ చాలా అవసరం కనుక ఈ సినిమాను ఆయనతో చేయాల్సిందిగా సురేందర్ రెడ్డికి సూచించాడట.
అఖిల్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి గూఢాచారిగా చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. మొదటి సారి అఖిల్ ఒక మంచి పాత్రను తనకు సూట్ అయ్యే పాత్రను చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే సినిమాను షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది దసరా వరకు సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.