కరోనా కారణంగా నిర్మాతలకు కోట్లల్లో నష్టం వాటిల్లుతోంది. సినిమాలు పూర్తి అయ్యి విడుదల కాకుండా ఉండటంతో పాటు చాలా సినిమాలు మద్యలో ఉండటం వల్ల మొత్తం ఇండస్ట్రీలో నిర్మాతలు కష్టాల్లో ఉన్నారు. అలాంటి వారి కోసం ఓటీటీ ప్లాట్ ఫామ్ లు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పూర్తి అయిన సినిమాలను కొనుగోలు చేసేందుకు ఓటీటీలు రెడీగా ఉన్నాయి. ఇప్పటి వరకు చిన్న సినిమాలు మాత్రమే ఓటీటీలో విడుదల అయ్యాయి. ‘వి’ తో పెద్ద సినిమాలు ఓటీటీకి క్యూ కట్టాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ‘వి’ తర్వాత ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయానికి దిల్‌రాజు వచ్చాడట. ఈ సినిమాకి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు దాదాపు 80 కోట్ల ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. అయితే సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. వి సినిమాను ఓటీటీలో విడుదల చేయడం వల్ల చాలా లాభం దక్కింది. సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న కారణంగా అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే నెగటివ్ టాక్ రావడంతో అమెజాన్‌కు నష్టం తప్పదంటున్నారు.
ఈ ప్రాజెక్ట్‌ను సేఫ్‌గా అమెజాన్ చేతిలో పెట్టడంతో రూపాయి లాభం దక్కించుకున్నాడు గాని నష్టం అయితే రాలేదు అంటున్నారు. దిల్ రాజు బ్యానర్ లో రూపొందిన సినిమాలు అన్ని కూడా మంచి టాక్‌ను దక్కించుకుంటాయి. అలాగే ఈ సినిమా కూడా బాగుంటుందని వి సినిమాపై అంచనాలు భారీగా పెట్టుకుంటే నిరాశ పర్చింది.
ఆ విషయం ముందే తెలిసి దిల్‌రాజు అమ్మేసి ఉంటాడేమో అంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టాక్ తో సంబంధం లేకుండా వకీల్ సాబ్ సినిమాను కూడా దిల్ రాజు వదిలించుకోవాలని భావిస్తున్నాడా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా రెండు వారాల చిత్రీకరణ చేయాల్సి ఉందట. అందుకు సంబంధించి ఎప్పుడు మొదలు పెట్టేది ఇంకా క్లారిటీ రాలేదు.
ఓటీటీకి అమ్మేయాలనుకుంటే పవన్ ను ఏదో విధంగా ఒప్పించి మెప్పించి దిల్ రాజు అక్టోబర్ లేదా నవంబర్ లో షూటింగ్ ను మొదలు పెట్టించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. బాలీవుడ్ మరియు తమిళంలో హిట్ అయిన సినిమాను తెలుగులో వకీల్ సాబ్‌గ ఆ రీమేక్ చేస్తున్నారు. అక్కడ హిట్ అయ్యింది కనుక ఇక్కడ కూడా హిట్ అవుతుందనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.