బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పూత్ మృతి తర్వాత పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. ముంబయి పోలీసులు సుశాంత్ ది ఆత్మహత్యగా నిర్థారించారు. అందుకు తగ్గట్లుగానే కేసును పూర్తి చేసేందుకు కసరత్తు చేశారు. ఆసమయంలో బీహార్ పోలీసులు రంగ ప్రవేశం చేసి రియా కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హడావుడి చేశారు.
రియా వారికి దొరకకుండా అండర్ గ్రౌండ్ కు వెళ్లి పోయింది. ఇదే సమయంలో సుశాంత్ కుటుంబ సభ్యులు మరియు అభిమానులు సీబీఐ ఎంక్వౌరీ వేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడంతో కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీం కోర్టు రెండు కూడా సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీబీఐ రంగంలోకి దిగినప్పటి నుండి అనేక అంశాలు బయటకు వస్తున్నాయి.
ముఖ్యంగా ఈ కేసులో డ్రగ్స్ గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. డ్రగ్స్ ను సుశాంత్ కోసం రియా కొనుగోలు చేసినట్లుగా ఒప్పుకుందట. ఇదే సమయంలో సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా రియా సోదరుడు శోవిక్ చెప్పడంతో అతడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కేసును మరో మలుపు తిప్పేందుకు రియా ముంబయి పోలీసులకు సుశాంత్ సోదరిపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది.
సుశాంత్ కు నిషేదిత ఔషదాలను ఇచ్చిందని డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ లేకుండా మందులు సుశాంత్ కు ఇచ్చిందని రియా ఫిర్యాదులో పేర్కొంది. అందుకు సంబంధించి సుశాంత్ మరియు ప్రియాంక సింగ్ ల వాట్సప్ చాటింగ్ ను రియా పోలీసుల ముందు ఉంచింది. ఢిల్లీలో ఒక డాక్టర్ ఇచ్చనట్లుగా ఆ మందులను ఇవ్వడం జరిగింది. కాని జూన్ 8వ తారీకున ముంబయిలోనే సుశాంత్ ఉండగా ప్రియాంక మాత్రం అతడు ఆ సమయంలో ఢిల్లీలో ఉన్నట్లుగా చూపించింది.
ఇది చట్ట రిత్యా నేరం. సుశాంత్ కు ఆ ఔషదాలు ఇచ్చిన కొన్నిరోజుల్లోనే మృతి చెందాడు కనుక తనకు వారిపై అనుమానం ఉందని చట్ట వ్యతిరేకంగా ఔషదాలను అందించిందంటూ తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ కేసు విషయంలో ముంబయి పోలీసులు ఎలా రియాక్ట్ అవ్వనున్నారు. ప్రియాంక సింగ్ ను అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి.