తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 ప్రారంభం అయ్యింది. మొదటి మూడు సీజన్ల కంటే ఈసారి చాలా ప్రత్యేకం అంటూ ఇప్పటికే షో నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్లామర్ విషయంలో షో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. గత సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ మరియు పున్నుల మద్య రొమాన్స్ చాలా హైలైట్ అయ్యింది. వారిద్దరితో షో మొత్తం మారిపోయింది. అంతకు ముందు సీజన్ లో ఒక కపుల్‌ను కూడా షోలో క్రియేట్ చేయడం జరిగింది.
ఈ సీజన్ లో కేవలం లవ్ ట్రాక్‌లు మాత్రమే కాకుండా కాస్త రొమాంటిక్ సీన్స్‌ను కూడా జొప్పించబోతున్నారట. ఇప్పటికే కంటెస్టెంట్స్ కొందరికి ఈ విషయంలో ఫుల్‌గా ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపించారట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ లో ముద్దు సీన్స్ మరియు లవ్ సీన్స్ ఇంకా పులిహోర ఫుల్‌గా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. భారీ ఎత్తున అంచనాలున్న బిగ్‌బాస్ సీజన్లో గంగవ్వ ఎంటర్ అవ్వడంతో పాటు అందమైన అమ్మాయిలు ఇందులో ఉండటం జరిగింది.
అన్ని విధాలుగా ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ఉన్నారు. కనుక షో మొత్తం రచ్చ రచ్చ అవ్వడం కన్ఫర్మ్ అంటున్నారు. గత సీజన్ల మాదిరి కంటే ఎక్కువగా రేటింగ్ రావడం కోసం ఖచ్చితంగా రొమాన్స్ ను జొప్పించడం ఖాయం అంటున్నారు. నాగార్జున మరియు ఇతర విషయాలతో టాస్క్‌లతో కనీసం రెండు జంటలు అయినా క్రియేట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. నిన్న మొత్తం కూడా షోలో కంటెస్టెంట్స్ ను పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా ఉండబోతుంది. రికార్డు బ్రేకింగ్ రేటింగ్ కోసం స్టార్ మా ఎంతకు అయినా తెగిస్తుంది అనడంలో సందేహం లేదు. అందుకే ఈసారి లిప్ లాక్ తో యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకోబోతున్నారు.
ఎప్పటి లా కాకుండా ఈసారి ఐపీఎల్‌తో బిగ్‌బాస్‌కు గట్టి పోటీ ఉంది. కనుక ముద్దులు హగ్గులు రొమాన్స్ లు గొడవలు లేనిది రేటింగ్ దక్కడం కష్టం. అందుకే ఐపీఎల్ ను మించిన ఎంటర్టైన్మెంట్ను బిగ్ బాస్ షోలో ఉంటుందని అంతా బలంగా నమ్ముతున్నారు. ఐపీఎల్ తో ఎలాంటి ఇబ్బంది లేకుండా షోను నిర్వాహకులు ప్రారంభించబోతున్నారు. కనుక రచ్చ రచ్చ ఖాయం అనిపిస్తుంది.