తెలుగు ప్రేక్షకులకు బిగ్‌బాస్ 2 ద్వారా పరిచయం అయిన నూతన్ నాయుడు ఆ తర్వాత కూడా రెగ్యులర్ గా మీడియాలో ఉంటున్న కారణంగా అతడి గురించి అందరికి తెలిసి పోయింది. ఆమద్య వర్మపై పరాన్నజీవి అనే సినిమాను తీసి పవన్ కళ్యాణ్ అభిమానులకు దేవుడు అయ్యాడు. నీవు గొప్పోడివి సామి అంటూ స్వయంగా పవన్ అభిమానులు ఆయన్ను పైకి ఎత్తారు. అతడు జనసేనలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా ఆయన ఇంట్లో ఒక దళితుడికి శిరోముండనం జరగడం సంచలనంగా మారింది.
నూతన్ నాయుడు భార్య దగ్గరుండి ఆ పని చేయించిందని సీసీ ఫుటేజ్ చూస్తే క్లీయర్‌గా ఉంది. ఇక ఈ కేసులో నూతన్ నాయుడు ఉండే అవకాశం లేదు అనుకున్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఆయన కర్నాటకలో ఉన్నాడు. కనుక ఆయన సేఫ్ అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఆయన్ను కర్నాటక పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ పోలీసులకు వారు త్వరలో నూతన్ నాయుడు అప్పగించబోతున్నారు.
ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికి ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం అందుతోంది. దళితుడి శిరో ముండనం కేసులో నూతన్ నాయుడుకు సంబంధం ఉన్నట్లుగా పోలీసులు నిర్థారించారట. ఆ సంఘటనను వీడియో కాలింగ్ ద్వారా ఆయన కూడా చూస్తూ ఉన్నాడని సాక్ష్యాధారాలు ఉన్నాయి. దాంతో దళితుడికి సంబంధించిన విషయంలో ఆయన్ను అరెస్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇదే సమయంలో ఒక మాజీ ఐఏఎస్ అధికారి పేరుతో ఫోన్ లు చేసి పలువురిని బెదిరించాడు అంటూ ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటి కారణంగా నూతన్ నాయుడును అరెస్ట్ చేసి ఉంటారు అంటున్నారు. ఆయన్ను త్వరలో ఏపీకి తీసుకు వస్తే అప్పుడు అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.